వాస్తవాలను రాస్తున్న డైనమిక్ పేపర్ దిశ..

వాస్తవాలను ఎప్పటికప్పుడు రాస్తున్న డైనమిక్ పేపర్ దిశ పేపర్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

Update: 2025-01-01 11:05 GMT

దిశ,సూర్యాపేట టౌన్: వాస్తవాలను ఎప్పటికప్పుడు రాస్తున్న డైనమిక్ పేపర్ దిశ పేపర్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో 2025 నూతన దిశ దిన పత్రిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. డైనమిక్ ఎడిషన్ తో డైనమిక్ వార్తలు రాస్తూ ప్రజల మన్ననలు పొందిన పత్రిక దిశ దినపత్రిక అని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవ శైలిలో వార్తలు రాస్తూ..ప్రజలకు ప్రభుత్వానికి వారధి లా ఉంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్న దిశ పత్రికకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. దిశ దిన పత్రికను చదువుతూ..ప్రతిరోజు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరిగే వార్తలను తెలుసుకుంటానని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రజాదారణ పొందిన ఏకైక పత్రిక దిశ దినపత్రిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, దిశ పత్రిక రిపోర్టర్లు తండ నాగేందర్, పెద్దపోలు వీరయ్య, గౌడ్,బొల్లికోoడ వీరస్వామి, కొంగల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News