ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
అనంతగిరి మండల కేంద్రంలో ఇరవై ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఆకస్మికంగా పరిశీలించారు.
దిశ, కోదాడ : అనంతగిరి మండల కేంద్రంలో ఇరవై ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులకు సూచించారు. హాస్టల్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. అనంతరం కోదాడ మండలంలో ధరణి సమస్యల పరిష్కారానికి అర్జీలు పెట్టుకున్న అర్జీదారుల వద్దకు నేరుగా వెళ్లారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు స్వయంగా పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సాయ గౌడ్, ఆర్ఐ రాజేష్, సర్వేయర్ పాల్గొన్నారు.