మిర్యాలగూడలో కాంగ్రెస్ మహా ధర్నా

టీపీసీసీ పిలుపు మేరకు నిరంతర విద్యుత్ సరఫరా, నీటి విడుదల కోరుతూ మంగళవారం... Congress Staged Protest at Miryalaguda

Update: 2023-02-14 10:57 GMT

దిశ, మిర్యాలగూడ: టీపీసీసీ పిలుపు మేరకు నిరంతర విద్యుత్ సరఫరా, నీటి విడుదల కోరుతూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ భవన్ నుండి పెద్ద సంఖ్యలో రైతులు ర్యాలీగా బయలుదేరి విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేసి డీఈ వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతులకి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందజేస్తానని ప్రకటించి 12 గంటలే ఇస్తున్నారన్నారు. వరి పొలాలు పొట్ట దశలో ఉన్నందున నీరందక పొలాలు ఎండి రైతులు ఆర్థికంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరి కోతలు పూర్తయ్యే వరకు 24 గంటల త్రీ ఫేస్ విద్యుత్ తోపాటు నిరంతర నీటి విడుదల చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News