రేపు యాదాద్రికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 9:30 నిమిషాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావులు పాల్గొననున్నారు.