చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి

నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ నేటి మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-26 10:27 GMT

దిశ, మర్రిగూడ : నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ నేటి మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో దివంగత వెంకటంపేట ఎల్లయ్య కుమారులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకోసం పోరాటం చేసిన వ్యక్తులను గుర్తుంచుకోవాలన్నారు. ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

    బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టడం అభినందనీయమన్నారు. నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నమనేని రవీందర్ రావు , మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర నాయకులు పగడాల లింగయ్య, కొడుకుల పెళ్లి యాదయ్య, మాజీ జెడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస శేఖర్, మండలంలోని అన్ని పార్టీల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News