Bus Service: బస్సు పునరుద్ధరణ.. గ్రామంలో సంబురాలు

సూర్యాపేట నుంచి నూతనకల్ ,చిల్పకుంట్ల,వెంకేపల్లి ,సంగెం,తుంగతుర్తి మీదుగా జగదిరిగుట్ట వరకు ఆర్టీసీ బస్సును ఆదివారం పునరుద్ధరించారు

Update: 2024-10-27 13:16 GMT

దిశ,నూతనకల్ : సూర్యాపేట నుంచి నూతనకల్ ,చిల్పకుంట్ల,వెంకేపల్లి ,సంగెం,తుంగతుర్తి మీదుగా జగదిరిగుట్ట వరకు ఆర్టీసీ బస్సును ఆదివారం పునరుద్ధరించారు. దాదాపు రెండు సంవత్సరాల నుంచి బస్సు లేకపోవడంతో.. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆర్టీసీ పునరాలోచించి మళ్లీ బస్సును పునరుద్ధరించడంతో.. జగదిరిగుట్టకు వెళ్లెందుకు బస్సు సౌకర్యం ఏర్పడిందని పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిల్పకుంట్ల లో స్థానిక ప్రజలు బస్సుకు మామిడి తోరణంతో, టెంకాయ కొట్టి ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో పులుసు మల్లయ్య, బత్తుల తిరుమలేష్, శ్రీరాములు, బొజ్జ శ్రీను, విజయ్, నగేష్, పోలేపాక శ్రీను, తదితర గ్రామ ప్రజలు ఉన్నారు.


Similar News