కర్నాటక గెలుపుతో బీజేపీ పతనం ప్రారంభం : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ పార్టీ పతనం ప్రారంభమైందని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి అన్నారు.
దిశ, మునుగోడు : కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ పార్టీ పతనం ప్రారంభమైందని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరిగే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో కూడా కర్నాటక తరహాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు అబివృద్ది చేందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. అందుకు ప్రతి కార్యకర్త సైనికుల వలే పనిచేయాలన్నారు. అనంతరం మునుగోడు పట్టణ అధ్యక్షులుగా అరెళ సైదులుని ఏకగ్రీవంగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల ప్రదీప్ రెడ్డి, మేకల మల్లయ్య, మారగోని అంజయ్య, మేకల శ్రీనివాస్ రెడ్డి, బోల్లం వెంకన్న, చోల్లేటి నర్శింహా చారి, మార్థ మోహన్ రెడ్డి, ఈదుల కంటి శంకర్, మారగొని ఉదయ్ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.