మునుగోడు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

Update: 2023-11-10 06:39 GMT

దిశ, మునుగోడు : మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మునుగోడు నియోజక వర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారో అదే ఆత్మగౌరవం బీఆర్ఎస్ లో కరువైందన్నారు. ఆత్మగౌరం కోసం కాంగ్రెస్ లోకి వస్తున్న వాళ్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ వెళ్ళిపోయిందన్నారు.

ప్రజల మీద విశ్వాసంతో మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పాత కొత్త అని తేడా లేకుండా కలిసి పనిచేసి మునుగోడును అభివృద్ధి చేసుకుందామన్నారు. అందరం కలిసి పని చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆత్మగౌరవ జెండా ఎగరేద్దామన్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ చంద్ రెడ్డి, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవి ముదిరాజ్, నాంపల్లి జెడ్పీటీసీ ఏ.వి.రెడ్డి, నాంపల్లి వైస్ఎంపీపీ పానుగంటి రజిని వెంకన్న గౌడ్, మునుగోడు వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్, నాంపల్లి మాజీ ఎంపీపీ రాజ వర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, కో ఆప్షన్ రపిక్ లతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు భారీ సంఖ్యలో ఉన్నారు.

Tags:    

Similar News