ప్రజావాణికి వినతుల వెల్లువ
వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అర్జీలను స్వీకరించారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 57అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవెన్యూ శాఖ 43, మున్సిపాలిటీ 3, జిల్లా పంచాయతీ శాఖ 3, గ్రామీణాభివృద్ధి శాఖ 2,దేవాదాయ శాఖ , సంక్షేమ , లేబర్, వ్యవసాయ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ లకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.