నిబంధనలకు విరుద్ధంగా.. ఎగిసిపడిన రాళ్లు.. కాలి బూడిదైన ట్రాన్స్ఫార్మర్..
మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో స్టోన్

దిశ, నల్గొండ బ్యూరో : మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో స్టోన్ క్రషర్స్ కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్ట్ చేస్తున్నారు. అనుమతి ఉన్నదాని కంటే ఎక్కువగా బ్లాస్టింగ్ చేసి ప్రభుత్వ సంపదను దోచేయడం తో పాటు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగినప్పటికీ పట్టించుకునే దిక్కు లేకపోవడం హాస్యాస్పదం..
40 ఏళ్ల క్రితం అనుమతి...
సుమారు 40 ఏళ్ల క్రితం నల్గొండ మండలం దోమలపల్లి గ్రామంలో ఉన్న చెరువు కింద సర్వేనెంబర్ 141 లో మారు ఏడెకరాల భూమి ఓ స్టోన్ క్రషర్స్ కాంట్రాక్టర్ మైనింగ్ పర్మిషన్ తీసుకొని గుట్టను తవ్వేశారు. సుమారు 40 ఫీట్ల ఎత్తుకు పైగా ఉన్న గుట్టను గతంలో కార్మికుల చేత బండలు కొట్టించేవారు కాబట్టి చుట్టుపక్కల భూములకు ఎలాంటి ఇబ్బంది లేదు..
నిబంధనలు విరుద్ధంగా బ్లాస్టింగ్.....?
దోమల పల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్స్ కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ లు పెడుతున్నారు.. మైనింగ్ శాఖ నుంచి 40 ఏళ్ల క్రితం సుమారు 7 ఎకరాలకు 10 ఎకరాల వరకు గుట్టను తొవ్వేశారు. అయితే 25 తేదీ రాత్రి 10 గంటల సమయంలో 30 ఫీట్ల లోతు వరకు బోరింగ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో చుట్టూ పక్కల నాలుగు కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున రాళ్లు ఎగిరి పడుతూ ఇండ్ల మీద పడడమే గాకుండా, భూకంపం వచ్చినట్లుగా ఇళ్లన్నీ ఒక్కసారిగా కదిలాయి. దీంతో ప్రజలంతా భయంతో అర్ధరాత్రి ఏం జరుగుతుందోనని ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు.. బ్లాస్టింగ్ చేయాలంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండానే బ్లాస్టింగ్ జరుగుతున్నాయి. గతంలో అనేక సార్లు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదు.
కాలి బూడిద అయిన ట్రాన్స్ఫార్మర్..
బోరింగ్ మిషన్ ను బండపై 30 ఫీట్ల లోతుకు దింపి బ్లాస్టింగ్ పెట్టడం వల్ల రాళ్లన్నీ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ కాలి బూడిదైంది. 11 కెవి విద్యుత్ వైర్ లు తెగిపడి సమీపంలో ఉన్న భూములలో గడ్డి , పెద్ద పెద్ద చెట్లు కాలిపోయి బూడిదగా మారింది. రాళ్ల అన్ని పక్కనే ఉన్న వ్యవసాయ భూములు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదిలా ఉంటే 25వ తేదీ రాత్రి విద్యుత్ తీగలు తెగి కింద పడితే 26వ తేదీ మధ్యాహ్నం వరకు స్టోన్ క్రషర్స్ కాంట్రాక్టర్ అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. రాత్రి వేళ సమయంలో వ్యవసాయ భూములలో మనుషులు,పశువులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందస్తు అనుమతి, సమాచారం లేకుండా ప్లాస్టింగ్ చేసిన క్రషర్స్ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..
స్టోన్ క్రషర్స్ అనుమతిని రద్దు చేయాలి.. : నారా బోయిన బిక్షం యాదవ్ మాజీ జడ్పీటీసీ నల్లగొండ
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ లు పెడుతున్న స్టోన్ క్రషర్స్ అనుమతిని రద్దు చేయాలి. ప్రస్తుతం వ్యవసాయానికి అడ్డంకిగా మారడంతో రైతులకు అసౌకర్యంగా ఉంది. అనుమతి ఉన్న వైశాల్యం ఒకటే ఎక్కువ విస్తీర్ణంలో మైనింగ్ తవ్వకాలు చేస్తున్నారు.దీనిపై విచారణ చేసి స్టోన్ క్రషర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.