కూలి పనులకు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్.. పలువురికి గాయాలు..

ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ మహిళ కాలు మధ్యకు నుజ్జునుజ్జయి తీవ్ర గాయాలైన ఘటన మఠంపల్లి మండలం పరిధిలోని రఘునాథ పాలెం గ్రామ సమీపంలోని మసీద్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

Update: 2025-03-26 07:40 GMT
కూలి పనులకు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టిన ట్రాక్టర్.. పలువురికి గాయాలు..
  • whatsapp icon

దిశ, మఠంపల్లి : ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ మహిళ కాలు మధ్యకు నుజ్జునుజ్జయి తీవ్ర గాయాలైన ఘటన మఠంపల్లి మండలం పరిధిలోని రఘునాథ పాలెం గ్రామ సమీపంలోని మసీద్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి కేంద్రానికి చెందిన దైద మానస (35) కొంత మంది కూలీలతో ఆటోలో మేళ్లచెరువు మండలంలోని కిష్టాపురం గ్రామానికి మిర్చి కూలి పనులకు వెళ్తున్నారు.

వారు ప్రయాణిస్తున్న ఆటో రఘునాథపురం గ్రామంలోని మసీదు సమీపంలో వెళ్ళగా అదే గ్రామానికి చెందిన వ్యవసాయ ట్రాక్టర్ పొలానికి వెళ్తుంది. ఆ సమయంలో ట్రాక్టర్ తన ఎదురుగా వెళుతున్న బైక్ ను క్రాస్ చేసే క్రమంలో ఆటో ఎదురుగా రావడంతో దానిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దైద మానస కాళ్లకు ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఆమె కాలు నుజ్జు నుజ్జు అయ్యి తీవ్ర.. గాయాలు కావడంతో వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. పలువురికి గాయాలైనట్లు సమాచారం.

Similar News