మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ

: మెండోరా మండలంలోని దూదియం గ్రామం జాతీయ రహదారి 44 ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద దొంగలు రెచ్చిపోయారు.

Update: 2024-10-01 14:53 GMT

దిశ, బాల్కొండ : మెండోరా మండలంలోని దూదియం గ్రామం జాతీయ రహదారి 44 ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద దొంగలు రెచ్చిపోయారు. నంద స్వప్న అనే మహిళ మెడ నుంచి రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొలుసుతో పరారయ్యారని ఎస్ఐ నారాయణ తెలిపారు. నిర్మల్ జిల్లా గొల్లపేటకు చెందిన స్వప్న కుమారుడు సిఎస్ఐ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థికి దసరా సెలవులు ప్రకటించడంతో..తన కుమారుని ఇంటికి తీసుకపోవడానికి వచ్చిన స్వప్న తిరుగు ప్రయాణంలో బస్టాండ్ సమీపంలో నిలబడి ఉంది. బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ మెడలోంచి బంగారం గొలుసు చోరీ చేసి ఆర్మూర్ వైపు వెళ్లినట్లు తెలిపారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


Similar News