నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి దొరికేశాడు?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేత పార్టీని వీడారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన..

Update: 2024-03-10 14:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేత పార్టీని వీడారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదివారం బీజేపీలో చేరారు. ఆయనతో పాటు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఎంపీలు నగేష్, సీతారాం నాయక్‌లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో చేరారు. నల్లగొండ ఎంపీ స్థానం అన్ని పార్టీల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నల్లగొండ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందనే ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని పోటిలో దించారు.

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దీటైనా అభ్యర్థులను వెతికేపనిలో పడింది. కాంగ్రెస్‌కు గట్టి పోటి ఇచ్చే అభ్యర్థులపై ఫోకస్ పెంచింది. అయితే బీజేపీ పార్టీకి ఆస్థానంలో అభ్యర్థులు ప్రశ్నార్థకంగా మారారు. గతంలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్ ఓట్లు సుమారు 52 వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ స్థానంలో శానంపూడి సైదిరెడ్డితో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టించేలా వ్యూహాలు రచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్లగొండ ఎంపీ టికెట్ శానంపూడికే ఇవ్వనున్నట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News