జిల్లా ఇంచార్జ్ జెడ్పీ చైర్మన్‌గా బాలాజీ సింగ్.. తెల్కపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఇన్‌చార్జి చైర్మన్‌గా వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ బాధ్యతలు స్వీకరించారు.

Update: 2022-11-28 11:30 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఇన్‌చార్జి చైర్మన్‌గా వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ముగ్గురు సంతానం ఉన్న కారణంగా తెలకపల్లి మండలం జెడ్పీటీసీ పద్మావతి ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్న బాలాజీ సింగుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో బాలాజీ సింగ్ బాధితులు స్వీకరించారు. అనంతరం ఆయనకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీ సీఈఓ ఉష తదితరులు అభినందనలు తెలిపారు. కాగా ముగ్గురు సంతానం కారణంగా పద్మావతి ఎన్నికలు రద్దు చేస్తూ, రెండవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రను జెడ్పీటీసీగా నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సుమిత్ర మంగళవారం జెడ్పీటీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 20 జెడ్పీటీసీలు ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ బలం ఒక స్థానం తగ్గి 16 ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలం నాలుగుకు పెరిగింది.

Read more:

బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ : మంత్రి హరీష్ రావు

Tags:    

Similar News