Revanth Reddy: 'నా పోటీ ఏపీ కాదు'.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్, చంద్రబాబును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-14 12:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అభివృద్ధి విషయంలో తమ పోటీ పొరుగున ఉన్న ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతో కాదని మా పోటీ అంతా ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో ఫ్రభుత్వం మారగానే హైదరాబాద్ నుంచి పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలివెళ్తాయనే చర్చ జరిగిందని కానీ, ఇక్కడ ఉన్నట్లుగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అనేక మౌలిక సదుపాయాలతో కూడిన హైదరాబాద్ నగరం పొరుగు రాష్ట్రాల్లో లేదన్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ కు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కోకాపేట జీఏఆర్ బిల్డింగ్ వద్ద జరిగిన కార్యక్రమం సందర్భంగా ఈ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ నగరం ఉన్నపళంగా ఎవరో ఒకరి వల్ల అభివృద్ధి చెందలేదని సుమారు 430 ఏళ్ల క్రితం నుంచి కులీ కుతుబ్ షాలు, నిజాం రాజులు, బ్రిటీషర్లు కలిసి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను అభివృద్ధి చేశారన్నారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ పీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్ కు పునాది పడితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ మూడో నగరంలో సైబరాబాద్ ను డెవలప్ చేశారన్నారు. నేతల మధ్య సిద్ధాంత పరమైన వైరుధ్యాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని అందువల్లే హైదరాబాద్ కు పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు.

ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ:

రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి డెవలప్ చేయబోతున్నామని చెప్పారు. అర్బన్ సెమీ, అర్బన్, రూరల్ గా మార్చబోతున్నామని చెప్పారు. పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే మా లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ గా మారనున్నదని, ప్రపంచ అవసరాలు తీర్చేలా ముచ్చర్లలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఫోర్త్ సిటీలో కాగ్నిజెంట్ భాగస్వామ్యం ఉండాలని, హైదరాబాద్ లో కాగ్నిజెంట్ లో ఉద్యోగుల సంఖ్య లక్షకు పెరగాలన్నారు. ఇందుకోసం ఈ సంస్థకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. పది రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని ఇవాళే రాష్ట్రానికి వచ్చామని ఈ విదేశీ పర్యటనలో రూ.31500 కోట్ల పెట్టుబడలు సాధించామన్నారు. సంస్థల ఏర్పాటు ద్వారా 30 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఒప్పందాలు కుదరనున్నాయి. ఒప్పందాలు ఫాలో చేయడానికి ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

గడిచిన పదేళ్లలోనే హైదరాబాద్ అభివృద్ధి కాలేదు:శ్రీధర్ బాబు

మేము చాలా నగరాలలో పర్యటించామని, ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ నగర అభివృద్ధి కేవలం గత దశాబ్ధకాలంలోనే జరగలేదని 3-4 దశాబ్ధాల కాలంగా ఈ నగరం అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఇందుకు కాగ్నిజెంట్ ఉదహారణ అన్నారు. ఇందుకు 1992లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సైబరాబాద్ లో ఐటీ పార్క్ డెవలప్ మెంట్ కోసం పునాది రాయి వేశారన్నారు. మేము ఐటీని డెవలప్ మెంట్ చేశామని, ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నామన్నారు. ఐఐటీలో ఏఐని స్థాపించామని, స్కీల్ ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

Tags:    

Similar News