MLA Rajagopal Reddy : మంత్రి పదవి కోసమే రాజగోపాల్ రెడ్డి న్యూ లుక్..! వీడియో వైరల్

కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. గడ్డం పెంచి కొత్త లుక్‌లో తాజాగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు.

Update: 2024-10-12 08:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూ లుక్‌లో కనిపిస్తున్నారు. గడ్డం పెంచి కొత్త లుక్‌లో తాజాగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి కొత్త లుక్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త గెటప్ అదిరింది సార్ అంటూ ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూ గెటప్‌పై ఓ టీవీ చానల్ రిపోర్టర్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గడ్డం పెంచడానికి గల స్పెషల్ ఏమిటి సార్ అని రిపోర్టర్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

తాను ఎప్పుడు నార్మల్‌గానే ఉంటారని, ఈ మధ్య డిఫరెంట్‌గా ఉండాలని, నాకు గడ్డం బాగుంటదని పలువురు చెప్పడంతో పెంచిన్నట్లు చెప్పారు. అంతే కానీ దీంట్లో పెద్ద స్పెషల్ ఏమీ లేదని, తాను ఏమీ సినిమాలో యాక్టింగ్ చేయడానికి గడ్డం పెంచలేదని, తాను ఎమ్మెల్యేగానే ఉంటానని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, ‘మంత్రి పదవి కోసమే రాజగోపాల్ రెడ్డి న్యూ లుక్’ అంటూ సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. నాడు కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దారిలో మంత్రి పదవి కోసం రాజగోపాల్‌రెడ్డి గడ్డం పెంచుతున్నారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి అయితేనే గడ్డం తీస్తారా? అంటూ హాట్ టాపిక్‌గా మారింది.


Similar News