ఈటల ఆరోపణలపై స్పందించిన మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, అందులో భాగంగానే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ రూ.25 కోట్లు ఫండింగ్ చేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.

Update: 2023-04-22 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, అందులో భాగంగానే కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ రూ.25 కోట్లు ఫండింగ్ చేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. దీనిపై ఇప్పటికే స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. దమ్ముంటే నిరూపించాలని ఈటలకు సవాల్ చేయగా.. తాజాగా.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం ఈటల రాజేందర్ మునుగోడు ఉప ఎన్నికపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలను కొనుగోలు చేయడంలో ఈటల కీలక పాత్ర పోషించారని అన్నారు. చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఈటల క్షమాపణ చెప్పాలని స్రవంతి డిమాండ్ చేశారు. లేకపోతే రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణమైనా చేయాలని సవాల్ చేశారు. సారీ చెప్పకపోతే ఈటలపై లీగల్‌గా ముందుకు వెళ్తామని అన్నారు.

Tags:    

Similar News