ఎస్సీ వర్గీకరణపై ఎంపీ నామా వాయిదా తీర్మానం

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఎస్సీ వర్గీకరణపై వాయిదా తీర్మానం

Update: 2022-03-31 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు  టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఎస్సీ వర్గీకరణపై వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ పంపించిన ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నదని స్పీకర్ దృష్టికి ఎంపీ నామా తీసుకెళ్లారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, ఈ అంశంపై సభ చర్చించాలని ప్రత్యేకంగా స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News