మూడింతలు పరిహారం చెల్లించి ఖాళీ చేయించండి: మూసీ కూల్చివేతలపై ఎంపీ కొండా
మూసీ సుందరీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్డెస్క్: మూసీ సుందరీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (గురువారం) అత్తాపూర్లో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన మూసీ బాధితులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతూ.. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేయడం దారుణమని, ఈ కూల్చివేతలను బీజేపీ సహించదని వార్నింగ్ ఇచ్చారు. పేదల బాధను పట్టించుకోకుండా ప్రభుత్వం బలవంతంగా కూల్చివేతలకు పాల్పడితే లక్ష మందితో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ మూడింతలు పరిహారం చెల్లించాకే ఇళ్లు ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.