ఖమ్మం సభ వేళ ఆసక్తి రేపుతోన్న కోమటిరెడ్డి ట్వీట్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేపు పండుగ రోజే. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చతికిల పడ్డ ఆ పార్టీకి ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు గట్టి బూస్ట్‌ను ఇచ్చాయి.
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేపు పండుగ రోజే. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చతికిల పడ్డ ఆ పార్టీకి ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు గట్టి బూస్ట్‌ను ఇచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని పక్కకు నెట్టి.. చేరికల జోరు పెంచింది. బెంగళూరు కేంద్రంగా పాలిటిక్స్‌ను స్టార్ట్ చేసి కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకుపోతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేసి కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా చేసుకుంటుంది. పార్టీ ఇంత కష్టపడుతున్నా.. సీనియర్ల రూపంలో కొన్ని అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం చేరికలపై అలకబూనిన విషయం తెలిసిందే. అయినా రేవంత్ రెడ్డి బుజ్జగింపులు, రాహుల్ గాంధీ వార్నింగ్‌లో అంతా ఒక్కతాటిపైకి వచ్చినట్టు కనిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి చేరికను ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకించినట్టు జోరుగా ప్రచారం జరిగింది. కానీ కోమటిరెడ్డి ఇవాళ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం (రేపు) ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగ సభకు నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు కదిలిరావాలని ఆయన చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. పొంగులేటి ఎంట్రీని అడ్డుకున్న ఆయనే.. మళ్లీ ఆ సభకు రావాలని పిలుపునివ్వడం జిల్లా ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
‘‘ఛలో ఖమ్మం..
తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లు తెంచడానికి..
అక్రమాల సర్కార్‌ను కూకటివేళ్ళతో పెకలించడానికి...
మార్గనిర్దేశం చేసేందుకు వస్తున్నారు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు...
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు.. రండి.. తరలిరండి...
ఖమ్మం గుమ్మంలో గర్జిద్దాం...’’ అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది.
ఛలో ఖమ్మం
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) July 1, 2023
తెలంగాణ ప్రజల బానిస సంకెళ్లు తెంచడానికి..
అక్రమాల సర్కార్ ను కూకటివేళ్ళతో పెకలించడానికి...
మార్గనిర్దేశం చేసేందుకు వస్తున్నారు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు...
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు.. రండి.. తరలిరండి...
ఖమ్మం గుమ్మంలో గర్జిద్దాం... pic.twitter.com/3LaCGukohn