దిగ్విజయ్ సింగ్ మీద నమ్మకం ఉంది: MP కోమటిరెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్‌‌లో తలెత్తిన పరిణామాలపై పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది.

Update: 2022-12-20 10:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్‌‌లో తలెత్తిన పరిణామాలపై పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. సమస్య మరింత జఠిలం కాకుండా పరిష్కారం దిశగా చర్చలు జరపాలని పరిశీలకుడిగా దిగ్విజయ్ సింగ్‌ను నియమించడంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. దిగ్విజయ్ సింగ్ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నేత అని హుజారాబాద్ పరిణామాతో పాటు తనపై పార్టీ నేతలు వాడిన పదజాలం, మార్ఫింగ్ వీడియోలపై దిగ్విజయ్ సింగ్ విచారణ జరపాలన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పని చేసే వారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని, కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. సీనియర్లకు అన్యాయం జరిగిందని ఈ విషయంలో దిగ్విజయ్ సింగ్ విచారణ చేయాలని కోరారు. గాంధీ భవన్ లో పైరవీ కారులకే పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఢిల్లీ పెద్దల సూచనతో కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నానని, ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమన్నారు.

Also Read: కాంగ్రెస్ నేతల రాజీనామా లేఖలపై భట్టి రియాక్షన్ ఇదే

Tags:    

Similar News