మునుగోడు బైపోల్ వేళ.. టీ-కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి బిగ్ షాక్!
మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తోన్న వేళ టీ-కాంగ్రెస్ నేతలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. ఈనెల 15న కుటుంబసభ్యులతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి విదేశీ పర్యటన
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తోన్న వేళ టీ-కాంగ్రెస్ నేతలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. ఈనెల 15న కుటుంబసభ్యులతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు తెలుస్తోంది. తిరిగి ఉప ఎన్నిక ఫలితాల అనంతరం స్వదేశానికి రానున్నట్లు సమాచారం. దీంతో మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వస్తారని భావించిన నేతలకు అనూహ్య షాక్ తగిలినట్టైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సైతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటారని పలుమార్లు మీడియాతో చెప్పారు. ఉప ఎన్నికలు జరుగడానికి కొన్ని రోజులముందు ఆయన కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. కాగా, బీజేపీ తరపున మునుగోడు బరిలో వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.
ALSO రీడ్ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు