MP Chamala: ఆ బాధ్యత కాంగ్రెస్ నాయకులదే
బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్లేమింగ్‌ను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి సోమవారం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్లేమింగ్‌ను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి సోమవారం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వివిధ కాంగ్రెస్ నేతలంతా ఇందుకు సహకరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు కూడా దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ జరిగిందని, గ్రామాల వారీగా ఒక్కొ రైతుతో ఒక నిమిషం పాటు రుణమాఫీపై స్పష్టత ఇచ్చేలా వీడియో తీయించి సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సాధారణ ఎన్నికల్లో ఎలా పనిచేశామో, ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలపై జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలిసేలా కార్యచరణ ఉండాలని కోరారు. ప్రతి కాంగ్రెస్ నేత ఫోకస్ పెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలంలో చేస్తున్న అభివృద్ధిని బీఆర్ ఎస్ ఓర్వలేకపోతున్నాదని, అందుకే తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారని మండిపడ్డారు.