BRS, కాంగ్రెస్ పార్టీల కుట్రను వెంకట్ రెడ్డి బట్టబయలు చేశారు: బండి సంజయ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీల కుట్రను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లియర్‌గా బయటపెట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-15 09:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీల కుట్రను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లియర్‌గా బయటపెట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపై ఎవరైనా మాట్లాడితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని రాహుల్ గాంధీ గతంలో చెప్పారని.. కానీ వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. వెంకట్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రకటనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కనీసం సస్పెండ్ చేయడం లేదని ధ్వజమెత్తారు.

ఈ రెండు పార్టీలు ఒక్కటేనని కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అధికారం పంచుకోవాలని అనుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనేక సందర్భల్లో కలిసి పనిచేశాయని గుర్తుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళను ఓడించడానికి ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని, పార్లమెంట్‌లో అనేక ఆందోళనలు కలిసే చేశాన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ పార్టీని కొనియాడారని గుర్తు చేశారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని, కోమటిరెడ్డి భోళా మనిషి అని అన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ల పార్టీ మనిషిని వాళ్లే నమ్మడం లేదని అన్నారు.

సేవాలాల్ ను స్మరించుకునే టైమ్ కూడా లేదా?:

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీ ద్రోహి అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ జయంతి సందర్భంగా సీఎం కేవలం ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని తప్పుబట్టారు. సేవాలాల్‌ను స్మరించుకునే టైమ్ కూడా కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు.

ఎన్నికల కోసం పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని అబద్ధం చెబుతున్నాడని.. గిరిజన బంధు సంగతి ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బంజారాహిల్స్‌లో సేవాలాల్ మహారాజ్ దేవాలయం కడతామని హామీ ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి రవీంద్ర నాయక్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News