మోడీ ఓ పిరికి ప్రధాని.. ఎంపీ లింగయ్య యాదవ్ ఫైర్

నరేంద్ర మోడీ ఒక పిరికి ప్రధాని అని, అదానీ ఏజెంట్లు మోడీ, అమిత్ షా అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు.

Update: 2023-04-26 16:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నరేంద్ర మోడీ ఒక పిరికి ప్రధాని అని, అదానీ ఏజెంట్లు మోడీ, అమిత్ షా అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు.బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ పార్టీకి లేని ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ పథకాలు, మోడల్ కావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ నోరుకు అదుపులేకుండా పోయిందని, సజావుగా సాగుతున్న పాలనను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలులో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రజాదరణ లేదని స్పష్టం చేశారు. ప్రధాని కూర్చి ఖాళీగా లేదని అమిత్ షా పేర్కొనడంపై మండిపడ్డారు. అమిత్ షా... మీ అయ్యా కూర్చి కాదు ప్రధాని చైర్ అన్నారు. మునుగోడు ఫలితమే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి రానున్నాయని వెల్లడించారు. బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని...నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎన్ని రైతు యాత్రలు చేసినా,, పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తిరిగి బీఆర్ఎస్ కు పట్టం కట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News