రుణమాఫీ విధివిధానాలపై MP డీకే అరుణ ఆగ్రహం

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది.

Update: 2024-07-16 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. ఇక రైతులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోన్న 2 లక్షల రైతు రుణమాఫీపై కూడా నిన్న రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 12 డిసెంబరు 2018 నుంచి డిసెంబరు 9 , 2023 వరకు తీసుకున్న అన్ని రకాల పంటలకు రుణమాఫీ చేస్తానని వెల్లడించింది. 2023 డిసెంబరు 9 నాటికి అసలు, వడ్డీ మొత్తం రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తానని తెలిపింది. తాజాగా రుణమాఫీపై ఎంపీ అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీపై నిబంధనలు పెట్టి మమా అనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాఫీ చేయడానికి ఇన్ని కండీషన్లు ఎందుకు? అని గొంతెత్తి ప్రశ్నించారు. కండీషన్లు పెట్టి అర్హుల సంఖ్య తగ్గించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని.. కాంగ్రెస్ సర్కారు రైతులకు అన్యాయం చేస్తుందంటూ ఎంపీ డీకే అరుణ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

Tags:    

Similar News