BSPకి ఆర్థిక సాయం చేసిన RS ప్రవీణ్ కుమార్ తల్లి
దిశ, వెబ్డెస్క్: బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్డెస్క్: బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బహుజన సమాజ్ పార్టీలో చేరి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీలో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన తల్లి పార్టీ అభివృద్ధికి ఆర్థిక సాయం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''నేను బీఎస్పీలో చేరి ఒక సంవత్సరమైన సందర్భంగా, మా అమ్మ పొదుపు చేసుకున్న తన పెన్షన్ నుండి బహుజన రాజ్యాధికార నిధికి రూ.50,000 విరాళంగా ఇచ్చింది.'' అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు.