ఇజ్రాయిల్ ​నుంచి ట్యాపింగ్​ డివైజ్.. ఫోన్ ట్యాప్ కేసులో వెలుగులోకి మరిన్నీ సంచలన విషయాలు..!

కలకలం సృష్టిస్తున్న ఫోన్​ట్యాపింగ్​వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగు చూసింది. ఎస్ఐబీకి టెక్నికల్​కన్సల్టెంట్‌గా ఉన్న వ్యక్తి

Update: 2024-03-25 15:19 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: కలకలం సృష్టిస్తున్న ఫోన్​ ట్యాపింగ్ ​వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగు చూసింది. ఎస్ఐబీకి టెక్నికల్​ కన్సల్టెంట్‌గా ఉన్న వ్యక్తి ద్వారానే ప్రణీత్​రావు ఫోన్​ ట్యాపింగ్ ​డివైజ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు వ్యక్తిని కూడా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించినట్టుగా సమాచారం. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో అరెస్టయిన ప్రణీత్ ​రావును కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న తరువాత జరిపిన విచారణలో ట్యాపింగ్ ​డివైజ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్టుగా వెల్లడైన విషయం తెలిసిందే. కాగా, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం ఇజ్రాయిల్ ​నుంచి ఈ ట్యాపింగ్ ​డివైజ్‌లను తెప్పించినట్టుగా సమాచారం. 300 మీటర్ల పరిధిలో ఫోన్లను ట్యాప్​ చేసి మాటలు నేరుగా వినపడటానికి ఉపయోగపడే ఈ డివైజ్‌ను ఎస్ఐబీకి టెన్నికల్ ​కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ సాఫ్ట్​వేర్ కంపెనీ పేర తెప్పించినట్టుగా తెలుస్తోంది.

దీని కోసం భారీ మొత్తంలో నగదును ఖర్చు చేసినట్టు సమాచారం. ఇలా తెప్పించిన డివైజ్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్‌లో పెట్టినట్టు తెలిసింది. ఆ తరువాత సీఎం రేవంత్​రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రుల ఫోన్లను ట్యాప్​చేసి ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులతో పాటు బీఆర్ఎస్‌లోని కొందరు కీలక నేతలకు చేరవేసినట్టుగా సమాచారం. విచారణలో ప్రణీత్​రావు ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా తెలియవచ్చింది. ఈ క్రమంలో సదరు టెక్నికల్ ​కన్సల్టెంట్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ బృందం నిర్ణయించినట్టుగా తెలిసింది.

Tags:    

Similar News