తెలంగాణకు మోడీ, షా, నడ్డా.. ఎన్నికల వేళ టీ- బీజేపీ భారీ స్కెచ్..!

ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు భారీ బహిరంగ

Update: 2023-09-20 17:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో వరుస పర్యటనలు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఒక్కొక్కరితో మూడేసి బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది సభలు నిర్వహించాలని చూస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ రెండు, మూడు రోజుల్లో ఖరారు కానుందని విశ్వసనీయ సమాచారం.

కాగా ప్రధాన మంత్రి మోడీ సభలు ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలత్లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా నిజామాబాద్‌లో పర్యటించే అవకాశముంది. అలాగే బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆ తరవాత కొత్త జిల్లా కేంద్రాల వారీగానూ సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది.

ఈ నెల 23న బీజేపీ ఎంపీలకు ఘన స్వాగతం

పార్లమెంట్ సమావేశాల్లో మహిళల రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ఎంపీలకు ఘన స్వాగతం పలకాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా ఈనెల 23వ తేదీన రాష్ట్రానికి చెందిన ఎంపీలకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలకనున్నారు. అనంతరం గన్ పార్క్ నుంచి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News