ఢిల్లీ నేతలు ఎవ్వరొచ్చిన తెలంగాణ బహుబలి కేసీఆరే: పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగాం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అంతా తమ పార్టీ అధికారంలో వస్తుంది తాము సీఎం అవుతామని కలలు
దిశ, వెబ్‌డెస్క్: జనగాం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అంతా తమ పార్టీ అధికారంలో వస్తుంది తాము సీఎం అవుతామని కలలు కంటున్నారు, కానీ వాళ్ల కలలు పీడ కలలుగానే మిగులుతాయని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొడంగల్, కామారెడ్డి రెండు చోట్ల ఓటమి ఖాయమన్నారు. సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో బరిలోకి దిగుతోన్న రేవంత్ రెడ్డికి అక్కడ డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు. ఢిల్లీ నేతలు ఎవ్వరొచ్చిన తెలంగాణ బహుబలి సీఎం కేసీఆరేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 80 నుంచి 100 సీట్లు గ్యారెంటీ అని దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణకు మూడవ సారి సీఎం అవ్వడం ఖాయమని పల్లా దీమా వ్యక్తం చేశారు.