కోర్టులోకి వెళ్లేముందు MLC కవిత సంచలన వ్యాఖ్యలు (వీడియో)
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ ఆఫీసులో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకొచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ ఆఫీసులో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మీడియాతో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ అక్రమం, అన్యాయం అని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని అన్నారు. అతి త్వరలో బయటకు వస్తానని.. ఎవరూ ఆందోళన చెందవద్దని తన అభిమానులకు సూచించారు. అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.
ఇదిలా ఉండగా.. లిక్కర్ కేసు విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయన విచారణ అనంతరం కవిత కోర్టులో హాజరయ్యారు. కవితను పదిరోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కాగా, కవితను నిన్న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ తరలించిన విషయం తెలిసిందే.
Read More : కవితకు తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంజెక్షన్లు...కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ షాకింగ్ కామెంట్స్