MLC Kavitha: 'మునుగోడు ఉప ఎన్నికల్లో TRS విజయం ఖాయం'

MLC Kavitha Says TRS will win in Munugode byPoll| కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికపై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ టీఆర్‌ఎస్‌కు కంచుకోటని, ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం

Update: 2022-08-10 08:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: MLC Kavitha Says TRS will win in Munugode byPoll| కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికపై ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ టీఆర్‌ఎస్‌కు కంచుకోటని, ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం తమదేనంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. హుజుర్ నగర్, నాగార్జున సాగర్ లాగానే మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తుందని అన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లేకున్నప్పటికీ అభివృద్ధి ఏమాత్రం ఆగలేదన్నారు. కరోనాలో సంక్షమ పథకాలు ఆపలేదని.. ప్రజలకు పెన్షన్లు అందించామని స్పష్టం చేశారు. ఇక బీహార్‌ రాజకీయాలను యావత్‌ దేశం గమనిస్తోందని, బీజేపీ బ్యాక్‌డోర్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం మంచి పద్ధతి కాదన్న కవిత మునుగోడు ఉపఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెబుతుందన్నారు.

ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. మూడు రంగుల్లో సూర్యుడు

మంథనిలో టీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. కేసు నమోదు (వీడియో)

Tags:    

Similar News