Kavitha: 8 బీజేపీ+ 8 కాంగ్రెస్ = రూ. 0 తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులపై కవిత రియాక్ట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ శనివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ శనివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణను విస్మరించారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎక్స్ వేదిగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘8 బీజేపీ ఎంపీలు+8 కాంగ్రెస్ ఎంపీలు= తెలంగాణకు రూ.0 ’ అంటూ ట్వీట్ చేశారు. బడ్జెట్ నిర్లక్ష్యం? అంటూ ట్యాగ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలు లోక్‌సభలో ఉన్నా.. యూనియన్ బడ్జెట్‌లో తెలంగాణకు జీరో నిధులు తీసుకువచ్చినట్లుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ సారాశం.
ఇక, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపును ప్రస్తావించారు. పోలవరానికి రూ. 12,157.53 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు రూ. 11,440 కోట్లను కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన విషయం తెలిసిందే.