Karregutta: కర్రెగుట్టలో కూంబింగ్‌ వెంటనే నిలిపివేయాలి.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞప్తి

శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు పదేపదే ప్రతిపాదిస్తున్నప్పటికీ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో కూంబింగ్‌ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Update: 2025-04-26 09:16 GMT
Karregutta: కర్రెగుట్టలో కూంబింగ్‌ వెంటనే నిలిపివేయాలి.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞప్తి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు పదేపదే ప్రతిపాదిస్తున్నప్పటికీ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో (Karregutta) కూంబింగ్‌ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కర్రెగుట్ట అడవులలో కూంబింగ్‌ నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు అంగీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణహోమం (Encounter) చేయడం సరైన చర్య కాదన్నారు. అణచివేత ఒక్కటే మార్గం కాదని వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. తాము శాంతి చర్చలకు సిద్దమని మావోయిస్టులు మరోసారి చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టడం శ్రేయస్కరం కాదని సూచించారు. ఇప్పటికే మావోయిస్టులు పదుల సంఖ్యలో హతమైనట్లు వార్తలు వస్తున్నాయని, అలాగే పదుల సంఖ్యలో సాయుధ బలగాలు వడదెబ్బకు గురైనట్లు సమాచారం వస్తున్నదని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.

Tags:    

Similar News