ఈడీ విచారణపై తండ్రి కేసీఆర్‌కు వివరించిన కవిత

ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో 9 గంటల పాటు ఈడీ ఎంక్వయిరీ వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

Update: 2023-03-12 15:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో 9 గంటల పాటు ఈడీ ఎంక్వయిరీ వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటపాటు సుధీర్ఘంగా చర్చించారు. విచారణలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు, చెప్పిన సమాధానాలను కవిత వివరించారు. తదుపరి ఏం జరుగనున్నదనే అంచనాను సైతం వివరించినట్లు తెలిసింది. అడుగుతున్న ప్రశ్నలతో పాటు ఈడీ ఆఫీసర్ల దగ్గరున్న ఆధారాలు, వాటిని బేస్ చేసుకుని జరిగిన విచారణ ప్రక్రియను క్లుప్తంగా వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందని అధికారులు ఆదేశించిన నేపథ్యంలో తిరిగి అధికారులు సంధించే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలనే విషయాలను కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. దైర్ఘ్యంగా ఉండాలని.. అన్నీ తాను చూసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రణాళికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. త్వరలోనే న్యాయనిపుణులతో భేటీ కానున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News