అమ్మా.. కమల బాణం అంటూ.. షర్మిలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా షర్మిలపై మరోసారి ఫైర్ అయ్యింది.
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా షర్మిలపై మరోసారి ఫైర్ అయ్యింది. బీజేపీ కోవర్టూ అంటూ, షర్మిల దొంగాటను ఎమ్మెల్సీ కవిత ఎండగట్టింది. అమ్మా కమల బాణం.. నేను పొలిటికల్ టూరిస్టును కాదు, ఉద్యమ బిడ్డను , తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతులు అంటూ కవిత తనదైన శైలిలో ట్వీట్ చేసింది.
అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణం
మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారెట్టు
మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి 'కవిత'ను నేను !
READ MORE