మీడియా గొంతును నొక్కుతున్న మోడీ : ఎమ్మెల్సీ కవిత
మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన వారిని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన వారిని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వాస్తవాలు చూపించే మీడియా గొంతును మోడీ ప్రభుత్వం నొక్కుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో చెబుతూనే ఉందని అన్నారు. ఒక వ్యాపార సంస్థ పై వచ్చిన ఆరోపణల పై దర్యాప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, కానీ అదే ప్రభుత్వం నిజాన్ని చూపించే ప్రయత్నం చేసిన బీబీసీ పై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పింది ఎందుకు..? అని ప్రశ్నించారు. బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులను కవిత తీవ్రంగా ఖండించారు.