బిగ్ న్యూస్: తీవ్ర ఉత్కంఠకు తెర.. ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణ హజరయ్యేందుకు బయలుదేరారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హజరయ్యేందుకు బయలుదేరారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుండి కాసేపటి క్రితం బయలుదేరిన కవిత.. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ కుమార్, న్యాయవాది భరత్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీ నేతలతో కలిసి చిరునవ్వుతో కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరారు.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ రోజు దాదాపు 9 గంటల పాటు విచారించిన ఈడీ.. ఈ నెల 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత.. పిటిషన్ పెండింగ్‌లో ఉందనే సాకుతో ఈ నెల 16న విచారణకు డుమ్మా కొట్టారు. అయినప్పటికీ ఈ నెల 20 విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ అవుతోందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
బిగ్ న్యూస్: కవిత ఈడీ విచారణపై తీవ్ర ఉత్కంఠ.. BRS వర్గాల్లో టెన్షన్.. టెన్షన్!