కవిత అడ్వకేట్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. ఫోన్లలోని డేటాపై ప్రధానంగా ఫోకస్!
ఢిల్లీలో కవిత అడ్వకేట్ సోమ భరత్ ఈడీ విచారణ ముగిసింది. ఈ నెల 21న విచారణ సందర్భంగా కవిత సమర్పించిన 10 ఫోన్లను పరిశీలించేందుకు రావాల్సిందిగా ఈడీ కవితకు నోటీసులు పంపిన నేపథ్యంలో తన ప్రతినిధిగా భరత్‌ను పంపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో కవిత అడ్వకేట్ సోమ భరత్ ఈడీ విచారణ ముగిసింది. ఈ నెల 21న విచారణ సందర్భంగా కవిత సమర్పించిన 10 ఫోన్లను పరిశీలించేందుకు రావాల్సిందిగా ఈడీ కవితకు నోటీసులు పంపిన నేపథ్యంలో తన ప్రతినిధిగా భరత్‌ను పంపించారు. దాంతో మంగళవారం ఈడీ కార్యాలయానికి వెళ్లిన భరత్‌ను దాదాపు ఐదు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.
కవిత ఫోన్లలో డేటా, ఇతర అంశాలపై భరత్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే మరోసారి విచారణకు పిలవలేదని కేవలం తమకు ఉన్న డౌట్స్‌ను నివృత్తి చేసుకునేందుకే పిలిచినట్లు సోమ భరత్ విచారణ అనంతరం తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇన్నాళ్లు నిందితుల నుంచి సమాచారం సేకరించిన ఈడీ తాజాగా ఫోన్లలో ఉన్న సమాచారాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో కేసులో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.