కవిత పర్యటన ఖరారు.. CBI నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ(మంగళవారం) ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ(మంగళవారం) ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు జగిత్యాలలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో సభా ఏర్పాట్లను ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరిశీలించనున్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల సీబీఐ విచారణకు హాజరు కాలేనని తెలిపింది. 11, 12, 14, 15 తేదీల్లో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఐ ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. అయితే, సీబీఐ నుంచి ఇంకా రిప్లై రాకవడంతో విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి : సీబీఐతో అంత ఈజీ కాదు.. విచారణపై కవిత ఊగిసలాట!