Telangana budget 2023 :సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు

మౌలిక సదుపాయాలు, ఉపాధి, పెరిగిన జీడీపీ, ప్రజాసంక్షేమం, వ్యవసాయం, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం

Update: 2023-02-06 11:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మౌలిక సదుపాయాలు, ఉపాధి, పెరిగిన జీడీపీ, ప్రజాసంక్షేమం, వ్యవసాయం, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, ఇది తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ విడుదల చేసిన బడ్జెట్ అని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ప్రతి ఒక్కరి స్వప్నానికి ప్రాతినిధ్యం వహించే విధంగా బడ్జెట్ ఉందని ఎమ్మెల్సీ కవిత సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా మోడీ ప్రభుత్వ 'కార్పొరేటర్ల బడ్జెట్‌'లా కాకుండా.. తెలంగాణ 2023-24 బడ్జెట్ సామాన్య ప్రజలను శక్తివంతం చేసేలా పనిచేసే నాయకులు ఉంటారని మరోసారి రుజువైందని అన్నారు. వనరులను న్యాయమైన మార్గంలో పంపిణీ చేసే ఘనత సీఎం కేసీఆర్‌‌కే ఉందన్నారు. ప్రజాకంటక నాయకులు చేస్తున్నది ఇదే అన్న కవిత.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలజెట్టుకున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News