CBI ఉన్నతాధికారికి MLC కల్వకుంట్ల కవిత లేఖ
సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు ఫిర్యాదు కాపీ కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ ఉన్నతాధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు ఫిర్యాదు కాపీ కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ ఉన్నతాధికారి అలోక్ కుమార్‌కు శనివారం లెటర్ రాశారు. విచారణకు ముందే సంబంధిత అనుబంధ కాపీలు తనకు అందేలా చూడాలని లేఖలో కోరారు. వివరణకు ముందు రెండు డాక్యుమెంట్లను ఇవ్వాలని కవిత కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ డాక్యుమెంట్లు పంపితే వివరణ ఇచ్చేందుకు ఈజీ అవుతుందని కవిత అభిప్రాయపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు శుక్రవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద కవితకు ఈ నోటీసులు జారీ అయినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఈనెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కవిత కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.