రైతుభరోసాపై పరిమితి విధిస్తే.. అందరికీ లబ్ధి జరగాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు భరోసా పథకంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు భరోసా పథకంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేయలేదు. ఈ క్రమంలోనే రైతు భరోసా పథకంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుభరోసా పథకంపై క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక వేళ రైతు భరోసాపై పరిమితిని నిర్ణయిస్తే.. అన్నదాతలందికీ లబ్ధి చేకూరేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా కేవలం ఐదు ఎకరాలు ఉన్న వారికే పథకాన్ని వర్తింపజేస్తే ఎక్కువ మొత్తంలో భూమి ఉన్న వారిని పథకంలో భాగస్వాములను చేస్తూ అంతే ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసే వారికి ప్రభుత్వం పోత్సాహం కూడా తోడైనట్లుగా ఉంటుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.