Jeevan Reddy: టీచర్ పోస్టుల్లో ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

టీచర్ పోస్టుల్లో ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-10-10 07:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిటన్లుగానే రాష్ట్రాలు కూడా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికి స్వేచ్ఛను ఇచ్చే విధంగా రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ చెబుతున్నట్లుగా తాజా ఉపాధ్యాయుల పోస్టుల్లోనే వర్గీకరణ అమలు చేయడం సాంకేతికంగా అసాధ్యం అన్నారు. నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదని ఇప్పుడు అమలు చేస్తామంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్ లో జరగబోయే ఉద్యోగ నియామకాలు అన్నీ వర్గీకరణ ప్రకారమే జరిగేలా చూడటమే కాకుండా భవిష్యత్ లో ఎలాంటి వివాదాలు లేకుండా చట్టబద్దంగా ఉండేలా ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను ప్రభుత్వం నియమించిందన్నారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇవ్వడంలేదన్నారు.

బీజేపీ నేతలు ఎన్నికలకు ముందు ఒకలా ఆ తర్వాత మరొకలా మాట్లాడుతున్నదన్నారని విమర్శించారు. అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ వర్గీకరణ విషయంలో అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లలేకపోయారని, ఆయన చేయలేకపోయారు కాబట్టే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందన్నారు. కేసీఆర్ బుద్ధిమంతుడే అయితే ఇట్లా ఉంటుండేనా అని ప్రశ్నించారు. వర్గీకరణ అనేది ఎస్సీల్లో విభజన తీసుకువచ్చినట్లు కాదన్నారు. బీసీల్లోనూ ఏ,బీ,సీడీ ఉందన్నారు. ఇది కొత్త అంశం కాదన్నారు. ఎస్సీలంతా కలిసే ఉన్నారన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణకు కోసం ఉషామెహ్ర కమిషన్ వేసిందని గుర్తు చేశారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికనే వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకుని జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. 


Similar News