కార్మికుడి మృతికి అసలు కారణం అదే: MLA శ్రీధర్ బాబు

భద్రతా లోపం కారణంగానే ఏఎమ్మార్ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడు మృతిచెందాడని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవేదన చెందారు.

Update: 2022-09-18 17:14 GMT

దిశ, మల్హర్: భద్రతా లోపం కారణంగానే ఏఎమ్మార్ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడు మృతిచెందాడని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవేదన చెందారు. ఆదివారం తాడిచెర్ల గ్రామానికి చెందిన అర్ని దశరథం రోజువారి విధుల్లో భాగంగా డ్యూటీకి వెళ్తూ లారీ ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక మహదేవ్ పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. లారీని అండర్ ఏజ్ డ్రైవర్ అతివేగంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదం సంభవించిందని అన్నారు. ఈ సందర్భంగా జెన్కో సీఎండీ, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాలతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఏఎమ్మార్ ప్రైవేట్ కంపెనీలో కంపెనీ ప్రతినిధులు ఇష్టం వచ్చిన రీతిలో ఉద్యోగాలు ఇవ్వడం, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, పరిజ్ఞానాన్ని చూడకుండా ఉద్యోగాల్లో తీసుకోవడం ఈ విధమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా కంపెనీ యజమాన్యం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, నాయకుడు అక్బర్ ఖాన్ ఉన్నారు.

Tags:    

Similar News