ఈడీ ఇబ్బంది పెడుతోంది.. హైకోర్టులో MLA Pilot Rohit Reddy పిటిషన్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఈడీ ఈసీఐఆర్‌ను కొట్టేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ రిట్ పిటిషన్‌లో దర్యాప్తు సంస్థ ఈడీ, కేంద్ర ప్రభుత్వం, ఈడీ డైరెక్టర్, ఈడీ హైదరాబాద్ జోన్ డైరెక్టర్‌ను రోహిత్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని.. మనీలాండరింగ్ కింద నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని రోహిత్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటంన్నింటి పరిశీలించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. కాగా, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ రేపు విచారణకు రానుంది.
Also Read..
CM KCRకు దమ్ముంటే.. ఆ ఎంపీతో రాజీనామా చేయించాలి: రఘునందన్ రావు సవాల్