లీగల్‌గా రమ్మంటే దౌర్జన్యం చేస్తున్నారు: ఎమ్మెల్యే మర్రి
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లను భూ వివాదం వెంటాడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రాగానే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొపాలనే ప్రయత్నం చేస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లను భూ వివాదం వెంటాడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రాగానే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మొపాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డీలకు సంబంధించిన బిల్లుంగులను కూడా సీజ్ చేసిన విజయం తెలిపింది. తాజాగా పేట్ బషీరాబాద్ లోని రెండున్నర ఎకరాల స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఆ స్థలం మాదంటూ పలువురు నిన్న మల్లారెడ్డి, ఆయన అల్లుడి తో వాగ్వాదానికి దిగారు. దీంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వారిపై దౌర్జన్యం చేశారని పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఓ మీడియాతో మాట్లాడుతూ.. మేము 13 సంవత్సరాల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నాము. 2011లో మల్లారెడ్డి, నేను అసలు రాజకీయాల్లోకి రాలేదు. కొందరు కావాలనే మాపై వివాదాలు సృష్టిస్తున్నారు. లీగల్ గా రమ్మంటే మాపైనే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. అలాగే ఈ వివాదంపై సర్వే కొనసాగుతుంది.. త్వరలోనే ఇది ఎవరి భూమి అనేది తేలిపోతుందని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.