బీఆర్ఎస్‌ను పార్లమెంట్ గేటు తాకనివ్వం: కోమటిరెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ను ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రానివ్వబోము అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతోందని జోస్యం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పని అయిపోయిందని.. ఉనికి కాపాడుకోవడానికి ఆ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, కానీ, అదంతా వృథాగా మిగిలిపోనుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని, కేటీఆర్ మళ్లీ అమెరికాకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై త్వరలోనే విచారణ జరుపుతామని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.