ఆయన జోలికి వస్తే ఊరుకోము.. కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-08-19 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ మహానేత అని.. అలాంటి మహానేతపై కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలే అని ఎద్దేవా చేశారు. పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి బంధం తెగిపోయిందని అన్నారు. కాగా, తెలంగాణ సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తరువాత తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామన్నారు. హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ పేరు మార్చి తెలంగాణ బిడ్డ పేరు పెడతామని స్పష్టం చేశారు. తాజాగా కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.

Tags:    

Similar News