ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించడం సరికాదు: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై బీఆర్కే భవన్‌లో సీఈవో వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్ లీగల్ టీంతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించడం సరైనది కాదని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ వచ్చిందని తెలిపారు. రాకేశ్‌రెడ్డికి వచ్చిన ఆధిక్యాన్ని లిస్టులో తీన్మార్ మల్లన్నకు చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇవన్ని చేస్తోందని మండిపడ్డారు. సీఈవో వికాస్‌రాజ్‌తో పాటు ఆర్వో వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.